టీ20 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్ శర్మ.!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ T20 ఫార్మాట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేశారు.

By Medi Samrat  Published on  19 Jan 2024 10:01 AM GMT
టీ20 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్ శర్మ.!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ T20 ఫార్మాట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేశారు. దీంతో వారు టీ20 ప్రపంచకప్‌ రేసులో ఉన్నట్టు తెలిపారు. మూడో టీ20లో సెంచరీ సాధించి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు రోహిత్. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవలేకపోయిన రోహిత్.. మూడో టీ20లో 121 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా విజయంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

అయితే అంద‌రూ అతని ఫిట్‌నెస్‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.అయితే రోహిత్ పూర్తి 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అంతేకాదు హిట్‌మ్యాన్ సూపర్ ఓవర్‌లో కూడా రెండుసార్లు బ్యాటింగ్ చేశాడు. ఇక‌ రెండో టీ20లో ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ మూడో మ్యాచ్‌లో డ‌కౌటయ్యాడు. రెండో మ్యాచ్‌లో విరాట్ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు.

బెంగళూరులో మూడో టీ20 తర్వాత బ్రాడ్‌కాస్టర్‌లతో మాట్లాడిన రోహిత్, కోహ్లీ, సంజూ శాంసన్‌లు ఎంత ముఖ్యమో హైలైట్ చెప్పాడు. మూడో టీ20లో విరాట్ బ్యాట్‌తో అద్భుతాలు చేయకపోయినా ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టాడు. విరాట్ బౌండరీ వద్ద గాలిలో ఎగురుతూ సిక్స్‌ను ఆపాడు. ఆ తర్వాత ఒక ముఖ్యమైన క్యాచ్‌ను కూడా అందుకున్నాడు, దాదాపు 38 మీటర్లు పరుగెత్తి క్యాచ్ ప‌ట్టుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో కీలకంగా మారింది.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. 'మేము ఆటగాళ్లకు వారి స్థానం, శైలి గురించి స్పష్టంగా తెలియజేస్తాం. చూడబోతే కోహ్లి వచ్చిన వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అతను సాధారణంగా దీన్ని చేయడు. కానీ ఫీల్డింగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ చూపించాడు. శాంసన్‌ కూడా వికెట్ల వెనుక చ‌రుకుగా క‌దిలాడు.

50 ఓవర్ల ప్రపంచకప్ తనకు పరాకాష్ట అని.. అయితే టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పాడు. ఇప్పుడే దాని గురించి ఆలోచించదలచుకోలేదు. 50 ఓవర్ల ప్రపంచకప్ నాకు అతిపెద్ద బహుమతి. టీ20 ప్రపంచకప్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌లను నేను ముఖ్యమైన టోర్నీలుగా చూడను. నేను వన్డే ప్రపంచకప్‌ను చూస్తూ పెరిగాను. మేము మా వంతు ప్రయత్నం చేసాము, కానీ దురదృష్టవశాత్తు మేము గెలవలేకపోయాము. టీమ్ మొత్తం కలత చెందారు. ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు టి20 ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. మేము దానిని గెలుస్తామని ఆశిస్తున్నాము.

Next Story