ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. రోహిత్, కోహ్లీ సిద్ధం..!

భారత జట్టు సీనియ‌ర్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు.

By -  Medi Samrat
Published on : 16 Oct 2025 6:44 PM IST

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. రోహిత్, కోహ్లీ సిద్ధం..!

భారత జట్టు సీనియ‌ర్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు. ఈ సిరీస్‌తో రోహిత్, కోహ్లి తిరిగి జట్టులోకి వస్తున్నారు. వారు ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చివరిసారిగా భారత్ తరపున ఆడారు. రోహిత్ ఈ సిరీస్‌లో పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్‌గా పాల్గొంటాడు.

అక్టోబర్ 19 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుండగా, అంతకు ముందు టీమ్ ఇండియా తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ సమయంలో అందరి దృష్టి రోహిత్, కోహ్లీలపైనే ఉంది. భారత మాజీ కెప్టెన్లు ఇద్దరూ నెట్స్‌లో దాదాపు 30 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశారు. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల పర్యటన కోసం భారత జట్టు బుధ, గురువారాల్లో రెండు గ్రూపులుగా ఆస్ట్రేలియా చేరుకుంది. నెట్స్‌లో గడిపిన తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్ చాలాసేపు చాట్ చేయడం కూడా కనిపించింది.

కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఈ సంవత్సరం ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. గత సంవత్సరం బార్బడోస్‌లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత T20 అంతర్జాతీయ కెరీర్‌లకు వీడ్కోలు పలికారు. బ‌హుశా.. ఈ ఇద్దరు గొప్ప ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఆడడం ఇదే చివరిసారి కావచ్చు. 2027 ప్రపంచ కప్‌లో వీరిద్దరూ ఆడే విష‌యంఐ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. వారి ఫామ్, ఫిట్‌నెస్‌పై ఈ విష‌యం ఆధారపడి ఉంటుంది. అయితే, కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరు సూపర్‌స్టార్‌లకు వారి అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతు ఇచ్చాడు.

నెట్ సెషన్ తర్వాత కోహ్లీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో చాట్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత అతడు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో కూడా మాట్లాడాడు. శుక్ర, శనివారాల్లో జట్టుకు శిక్షణ ఉంటుంది.

Next Story