21న మీటింగ్‌కు రోహిత్.. ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించేది ఆరోజే..!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల
By Medi Samrat Published on 19 Aug 2023 9:12 AM GMTఅజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం (ఆగస్టు 21) ఢిల్లీలో సమావేశం కానుంది. భారత జట్టు కీలక ఆటగాళ్ల గాయాల ఆందోళనతో ఆసియా కప్, ప్రపంచ కప్ లకు ఇంకా జట్లను ప్రకటించలేదు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే తమ టీమ్‌లను ప్రకటించాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కోసం తాత్కాలిక జట్లను కూడా ప్రకటించాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. జట్టు ఎంపిక ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడమే. చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు గాయపడ్డారు. ఆ ఆటగాళ్లలో కొందరు నెమ్మదిగా రికవరీ అవుతున్నారు. భారత్ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తుందా లేక మరికొంత మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్‌కు చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు గాయాలవడంతో వారు ఆటకు దూరంగా ఉన్నారు. రాహుల్ ఇటీవలే బ్యాటింగ్ ప్రారంభించి పునరాగమనానికి సిద్ధమయ్యాడు. మరి అతడిని జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. అయ్యర్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు బుమ్రా తిరిగి వచ్చాడు. సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి టీ0లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో బుమ్రా తన ఫిట్‌నెస్‌ను రుజువు చేసుకున్నాడు.
బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా జూలై 19న ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 30న టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్ గ్రూప్-ఎలో ఉంది. పాకిస్థాన్, నేపాల్ కూడా గ్రూప్-ఎలో ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు జట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.