టీమ్ఇండియాకు భారీ షాక్‌.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు క‌రోనా

Rohit Sharma tests positive for Covid-19.ఇంగ్లాండ్‌తో ఆడే కీల‌క టెస్టు మ్యాచ్ కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2022 7:59 AM IST
టీమ్ఇండియాకు భారీ షాక్‌.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు క‌రోనా

ఇంగ్లాండ్‌తో ఆడే కీల‌క టెస్టు మ్యాచ్ కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌రోనా బారిన ప‌డ్డాడు. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో అత‌డికి క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయిన‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌స్తుతం రోహిత్‌.. తాను బ‌స చేస్తున్న హోట‌ల్‌లోనే క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

"శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" బీసీసీఐ ట్వీట్ చేసింది.

కాగా..గతేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన‌ ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్ప‌టికే ఇంగ్లాండ్ చేరుకున్న భార‌త జ‌ట్టు లీసెస్ట‌ర్ షైర్ జ‌ట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ 25 ప‌రుగులు చేశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు. రోహిత్ క‌రోనా బారిన ప‌డ‌డంతో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. మ‌రీ టెస్టు మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో బీసీసీఐ ఇంకా తెలియ‌జేయ‌లేదు. ఒక‌వేళ రోహిత్ దూరం అయితే.. భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

Next Story