విరాట్ కోహ్లీని దాటేసిన హిట్ మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్నాడు.

By Medi Samrat  Published on  18 Oct 2023 12:08 PM GMT
విరాట్ కోహ్లీని దాటేసిన హిట్ మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్నాడు. వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారి అధిగమించాడు. ఈ జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 9వ ర్యాంక్ లో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఉండగా, రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. గిల్ డెంగ్యూ కారణంగా ప్రపంచ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇకపై గిల్ పరుగుల వేట మొదలవుతుందని భారత అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. బాబర్ ఆజం భారత్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడంతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోడానికి 18 పాయింట్లకు పెంచుకున్నాడు.

2023 ప్రపంచ కప్‌లో రోహిత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు. మొదటి మ్యాచ్ లో రోహిత్ డకౌట్ గా వెనుదిరిగినా కూడా ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో అద్భుతమైన బ్యాటింగ్ తో సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. రోహిత్ మూడు మ్యాచ్‌లలో 217 పరుగులు చేశాడు, 72 కంటే ఎక్కువ సగటు, 141.83 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. రాబోయే మ్యాచ్ లలో ఇంకెంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడబోతున్నాడోనని భారత అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story