Video : త్వ‌ర‌గా ఔట‌య్యారు.. ఎంచ‌క్కా పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు..!

పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు తన తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది.

By -  Medi Samrat
Published on : 19 Oct 2025 2:25 PM IST

Video : త్వ‌ర‌గా ఔట‌య్యారు.. ఎంచ‌క్కా పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు..!

పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు తన తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్‌గా అరంగేట్రం చేస్తున్నాడు. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించి ఇబ్బందులను సృష్టించింది. ఇంతలో గిల్, రోహిత్ శర్మ సరదాగా పాప్ కార్న్ తింటూ కనిపించారు.

రోహిత్‌, గిల్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఇద్దరు బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మను హేజిల్‌వుడ్ అవుట్ చేశాడు. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. శుభ్‌మన్ గిల్‌ను నాథన్ ఎల్లిస్ అవుట్ చేశాడు. గిల్ 18 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.



తొలిసారి మ్యాచ్‌లో వర్షం రావడంతో మ్యాచ్ చాలా సేపు నిలిచిపోయింది. దాదాపు గంట పాటు మ్యాచ్ జరగలేదు.ఇంతలో గిల్, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకోవడం కనిపించింది. ఇద్దరూ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో గిల్ లేచి పాప్ కార్న్ పెట్టెతో తిరిగొచ్చాడు. దీని తర్వాత.. ఇద్దరు ఆటగాళ్లు పాప్‌కార్న్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు.

రోహిత్ నుంచి గిల్ కెప్టెన్సీ తీసుకున్నాడు. రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత, గిల్ ఈ ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్సీని తీసుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లోనూ గిల్ అతని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గిల్ కెప్టెన్సీలో రోహిత్ తొలిసారి ఆడబోతున్నాడు.


ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతోపాటు భారత బ్యాటింగ్ కూడా విఫలమైంది. రోహిత్, గిల్ త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్ కాగా, విరాట్ కోహ్లీ కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అతడిని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. కొంతసేపటికి మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఆగిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది భార‌త్‌. అయ్యర్‌ను జోష్ హేజిల్‌వుడ్ అవుట్ చేశాడు. అయ్యర్ 14 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Next Story