రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారి జీవితాల్లోకి మగబిడ్డను ఆహ్వానించారు.

By Medi Samrat  Published on  16 Nov 2024 9:00 AM IST
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారి జీవితాల్లోకి మగబిడ్డను ఆహ్వానించారు. రితికా రెండవ బిడ్డకు కాన్పు కారణంగా రోహిత్ శర్మ మిగిలిన భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఈ దంపతులకు సమైరా అనే కుమార్తె 2018లో జన్మించింది.

నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే పెర్త్ టెస్టులో రోహిత్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి టెస్ట్‌కు ఒక వారం కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ వెళ్లట్లేదని బీసీసీఐ నుండి కూడా ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు రోహిత్ వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొదటి టెస్టులో రోహిత్ పాల్గొనడంపై సందేహాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కెప్టెన్ అందుబాటులో ఉంటాడని చాలా ఆశాభావం వ్యక్తం చేశాడు.

టాప్ ఆర్డర్ వైఫల్యం కొనసాగుతూ ఉన్న క్రమంలో భారత జట్టుకు ప్రస్తుతం కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ అవసరం. రోహిత్ అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినా అతడు జట్టులో ఉంటే మరింత బలం ఉంటుందని ఆశిస్తూ ఉంది టీమ్ మేనేజ్మెంట్.

Next Story