గాయంపై స్పందించిన హిట్‌మ్యాన్.. ఏమన్నాడంటే..?
Rohit Sharma provides an update on his injury.విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2022 7:20 AM GMTవిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. అయితే మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడో లేదోనన్న సందేహాలు రెకెత్తుతున్నాయి. హిట్‌మ్యాన్ రోహిత్ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతుండడమే అందుకు కారణం.
మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్(5 బంతుల్లో 11, ఒక సిక్స్, ఒక ఫోర్) దూకుడునే ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా నడుం కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వదిలి వెళ్లాడు. దీంతో అతడికి ఏమైందోనని అభిమానులు కంగారు పడుతుండగా మ్యాచ్ అనంతరం దీనిపై రోహిత్ స్పందించాడు. "ప్రస్తుతం బాగానే ఉందని, నాలుగో టీ20కి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ఆలోపు కోలుకుంటాననే భావిస్తున్నా. ఇక ఈ రోజు మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలే. అయితే పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న బౌలర్లు విభిన్నంగా బంతులు వేశారు. ఇక్కడ టార్గెట్ ఛేదించడం అంత సులువేం కాదు. బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే పరుగులు రాబట్టారు. సూర్య అద్భుతంగా ఆడాడు "అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పందించింది." టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం వెన్ను నొప్పి ఉంది. అతని పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మిగతా టి20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడే చెప్పలేం " అని ట్వీట్ చేసింది.
గాయం తీవ్రత తగ్గినప్పటికి రోహిత్ నాలుగో టీ20లో ఆడే అవకాశం కనిపించడం లేదు. వెస్టిండీస్ సిరీస్ అనంతరం కీలకమైన ఆసియా కప్ టోర్నీ ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లకు రోహిత్‌కు విశ్రాంతి నిచ్చే అవకాశం ఉంది.