పూర్తి రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. ఈ విజయం తర్వాత టీ20 క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్‌లు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 9:30 AM ISTపూర్తి రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. ఈ విజయం తర్వాత టీ20 క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్‌లు గుడ్‌బై చెప్పారు. కెప్టెన్ రోహిత్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వరల్డ్ కప్ అందుకున్న వెంటనే ఒకరి తర్వాత మరొకరు ఈ ప్రకటన చేశారు. అయితే.. రోహిత్ మిగతా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన పూర్తిస్థాయి రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఈ ఏడాదితో 37 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కెరియర్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ పలువురు వ్యాఖ్యానించారు. అతను వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన పూర్తిస్థాయి రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ఇంకొంత కాలం క్రికెట్ ఆడుతానని చెప్పాడు. సుదీర్ఘ ప్రణాళికలు లేవనీ అన్నాడు. డాలస్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు వెళ్లిన సందర్భంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
ఇక రోహిత్ వర్మ ఐపీఎల్‌లో కొనసాగనున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్.. ఈ నెలలోనే శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ కు విరాట్, రోహిత్‌కు విశ్రాంతినిచ్చే చాన్స్ ఉంది. అనంతరం బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వరుస సిరీస్‌లతో టీమ్‌ఇండియా బిజీబిజీగా ఉండనుంది. శ్రీలంక టూర్ నుంచే కొత్తగా ఎన్నికైన టీమిండియా హెడ్ కోచ్ తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.