ఆ రూల్ అంటే నాకు అసలు నచ్చదు : రోహిత్ శర్మ

వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో పరాజయం తర్వాత ముంబై ఇండియన్స్ తిరిగి గాడిలో పడాలని అనుకుంటూ ఉంది.

By Medi Samrat  Published on  18 April 2024 1:00 PM GMT
ఆ రూల్ అంటే నాకు అసలు నచ్చదు : రోహిత్ శర్మ

వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో పరాజయం తర్వాత ముంబై ఇండియన్స్ తిరిగి గాడిలో పడాలని అనుకుంటూ ఉంది. గురువారం ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేసాడు. IPL లో ఇంపాక్ట్ సబ్ రూల్ గురించి రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంపాక్ట్ సబ్ రూల్‌కి తాను పెద్ద అభిమానిని కాదని.. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు బౌలింగ్ రాకపోవడం వల్ల వారికి చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.

“ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కి పెద్ద అభిమానిని కాదు. ఇది వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి భారతీయ ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రతిభను నిలువరిస్తోంది, ఎందుకంటే వారు బౌలింగ్ చేయలేరు, ఇది భారత జట్టుకు మంచిది కాదు" అని గిల్‌క్రిస్ట్‌తో క్లబ్ ప్రైరీ పోడ్‌కాస్ట్‌లో రోహిత్ శర్మ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక పెద్ద మైలురాయిని అధిగమించనున్నాడు. రోహిత్ తన 250వ IPL గేమ్‌లో ఆడబోతున్నాడు. ఆ మైలు రాయిని దాటిన రెండవ ఆటగాడు అవుతాడు. రోహిత్ 249 ఐపీఎల్ గేమ్‌లలో, అతను 30.10 సగటుతో 6472 పరుగులు చేశాడు. ఈ స్పెషల్ మ్యాచ్ లో రోహిత్ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story