ఆ ప్రపంచ రికార్డు రోహిత్ ఒక్కడికే సాధ్యం.. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లియర్ చేసేయొచ్చు..!
ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. రెండు రోజుల తర్వాత ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 17 Feb 2025 10:06 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. రెండు రోజుల తర్వాత ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అతను అద్భుత సెంచరీ చేశాడు. దీని తర్వాత, అతడు గత మ్యాచ్‌లో పరుగులు చేయడంలో విఫలమై ఉండవచ్చు, కానీ ఆ సెంచరీ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచ రికార్డుపై రోహిత్ కన్ను పడింది. ఆ రికార్డు ఏమిటో తెలుసుకుందాం.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో 12 సిక్సర్లు కొడితే, వన్డే ఫార్మాట్‌లో 350 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. అదే సమయంలో టోర్నీలో రోహిత్ 14 సిక్సర్లు బాదితే వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ విషయంలో తన 300వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదిని అధిగమించనున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 వన్డే ఇన్నింగ్స్‌లలో 338 సిక్సర్లు బాదాడు. కాగా.. అఫ్రిదీని దాటి ప్రపంచ నంబర్-1గా నిలిచే గోల్డెన్ ఛాన్స్ రోహిత్‌కు లభించింది.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్
షాహిద్ అఫ్రిది- 351 సిక్సర్లు
రోహిత్ శర్మ- 338 సిక్సర్లు
క్రిస్ గేల్- 331 సిక్సర్లు
సనత్ జయసూర్య- 270 సిక్సర్లు
ఎంఎస్ ధోని- 229 సిక్సర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్
రోహిత్ శర్మ- 631
క్రిస్ గేల్- 553
షాహిద్ అఫ్రిది- 446
బ్రెండన్ మెకల్లమ్- 398
మార్టిన్ గప్టిల్- 383
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్, షమీ, అర్ష్‌దీప్