2024 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20I మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. T20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 మెన్స్ టీమ్ కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ తో పాటూ మరో ముగ్గురు భారతీయులు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లు జట్టులో ఉన్నారు. ఈ జట్టులో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం కూడా ఉన్నాడు.
2024 ICC T20I మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భాగమైన ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
జూన్‌లో జరిగిన T20 ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా, T20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లెవరూ జట్టులో స్థానం దక్కించుకోలేదు. ప్రపంచ నంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులో లేడు.