రోహిత్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు.. భయపడుతున్నాడు
Rohit Sharma Looked Scared And Confused says Mohammed Hafeez.కెప్టెన్‌గా సఫలం అవుతున్నప్పటికీ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిరాశపరుస్తున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 2 Sep 2022 9:05 AM GMTకెప్టెన్‌గా సఫలం అవుతున్నప్పటికీ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిరాశపరుస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో పాటు అంతర్జాతీయ టీ20ల్లోనూ గత కొంతకాలంగా రోహిత్ పెద్దగా రాణించింది లేదు. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌ల్లో 33 పరుగులు చేశాడు. పాక్‌పై 18 బంతుల్లో 12, హాంకాంగ్‌పై 13 బంతుల్లో21 పరుగులు చేశాడు. ప్రస్తుతం అందరి దృష్టి విరాట్‌పైనే ఉండడంతో రోహిత్ ఫామ్ గురించి పెద్దగా చర్చకు రావడం లేదు.
టీమ్ఇండియా బాధ్యతలు చేపట్టిన తరువాత హిట్‌మ్యాన్‌లో దూకుడు తగ్గిందనే చెప్పాలి. ఇంగ్లాండ్, విండీస్ టీ20 సిరీస్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. రోహిత్ మునుపటి ఫామ్‌ను అందుకోకుంటే రానున్న రోజుల్లో టీమ్ఇండియాకు ఇబ్బందులు తప్పవని, ఎక్కువ కాలం కెప్టెన్‌గా కూడా ఉండకపోవచ్చు నని పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఓ క్రీడా చానల్ చర్చా కార్యక్రమంలో హఫీజ్ మాట్లాడుతూ.. హాంకాంగ్‌పై భారత్ విజయం సాధించినప్పటికీ రోహిత్ ముఖంలో ఆ ఆనందం కనిపించలేదన్నాడు. ప్రస్తుతం రోహిత్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని అనిపిస్తోందని, కెప్టెన్సీ అతడికి భారంగా అనిపిస్తోందేమోనని చెప్పుకొచ్చాడు.
హాంకాంగ్ మ్యాచ్‌లో టాస్‌కు వచ్చిన సమయంలో రోహిత్ భయపడుతున్నట్లు, అయోమయంలో ఉన్నట్లు కనిపించాడు. గతంలో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది వరకు ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అతడిలో చూడలేదు. మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు గురించి మాట్లాడుతున్నాడు. అయితే.. అవి అతడి బాడీ లాంగ్వేజ్‌లో కనిపించడం లేదు. మాట్లాడం చాలా తేలికే కాని.. వాటిని అమలు చేయడం చాలా కష్టం. ఇక నా అభిప్రాయం ప్రకారం రోహిత్.. ఎక్కువ కాలం భారత కెప్టెన్‌గా కొనసాగడం కష్టం అని హఫీజ్ చెప్పుకొచ్చాడు.