జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి గత తొమ్మిది నెలలు గొప్ప ఉదాహరణ - రోహిత్

గత తొమ్మిది నెలలుగా తమ జట్టు క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొందని, విజయం సాధించేందుకు సమిష్టిగా పోరాడిందని, గత మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న జట్టులోని ప్రతి సభ్యుడికి గౌరవం దక్కుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

By Medi Samrat
Published on : 30 March 2025 8:05 AM IST

జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి గత తొమ్మిది నెలలు గొప్ప ఉదాహరణ - రోహిత్

గత తొమ్మిది నెలలుగా తమ జట్టు క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొందని, విజయం సాధించేందుకు సమిష్టిగా పోరాడిందని, గత మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న జట్టులోని ప్రతి సభ్యుడికి గౌరవం దక్కుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొగా.. ODI ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు ఓడిపోయింది.

భారత కెప్టెన్‌గా తన పదవీకాలం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ఈ జట్టు మూడు ప్రధాన టోర్నమెంట్‌లలో సాధించినది అద్భుతమైనది. ఊహించుకోండి.. మనం ODI ప్రపంచకప్ గెలిచినట్లయితే.. మూడు ICC టోర్నమెంట్లలో అజేయంగా మిగిలి ఉండేవాళ్లం. దీని గురించి ఎప్పుడూ వినలేదు. 24 మ్యాచ్‌ల్లో 23 గెలిచింది. బయటి నుంచి చూస్తే చాలా బాగుంది కానీ ఈ టీమ్ చాలా ఎత్తుపల్లాలు చూసింది.

ముంబై ఇండియన్స్ 'X' పేజీలో జట్టు పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్ మాట్లాడుతూ.. మేము కూడా కష్ట సమయాలను చూశాము, అయితే మీరు కూడా జరుపుకునే అవకాశం వచ్చింది. గత మూడు టోర్నీలు ఆడిన ప్రతి క్రీడాకారుడికి గౌరవం దక్కుతుందని నేను నమ్ముతున్నాను. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి బీసీసీఐ ఉన్నతాధికారులు సమావేశాన్ని నిర్వహించాల్సిన సమయంలో రోహిత్ ఇంటర్వ్యూ వచ్చింది. అయితే ఆ సమావేశం వాయిదా పడింది.

కష్టతరమైన దశలో ఉన్న, తిరిగి రావాలనుకునే ఆటగాళ్లందరికీ ఇది మంచి స‌మ‌యం అని రోహిత్ చెప్పాడు. స్వదేశంలో సిరీస్ కోల్పోయి ఆస్ట్రేలియాలో సరిగా ఆడలేదు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాం. జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి గత తొమ్మిది నెలలు గొప్ప ఉదాహరణ. హెచ్చు తగ్గులు ఎప్పుడూ ఉంటాయన్నాడు.

రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌లో ఆటగాడిగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అదే సమయంలో రోహిత్ శర్మ ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లడని కూడా వార్తలు వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం, టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్ళడానికి రోహిత్ స్వయంగా నిరాకరించాడు. ఐపీఎల్ తర్వాత అతను సెలవులో ఉండనున్నాడు.

Next Story