రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించాడు.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 9:31 PM IST

రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించాడు. రోహిత్ తాజా ఐసీసీ పురుషుల వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 38 సంవత్సరాల 182 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.

అత్యంత లేటు వయసులో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా అవతరించిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన రోహిత్‌ ఆస్ట్రేలియాతో రెండు మూడు వన్డేలలో మంచి ఇన్నింగ్స్ ఆడి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌ ప్లేస్‌కు చేరాడు. సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌గా అవతరించిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆసీస్‌తో తాజాగా జరిగిన 3 మ్యాచ్‌లో సిరీస్‌లో విఫలమైన గిల్‌ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి చేరాడు.

Next Story