సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లా టాప్ లేపారు భారత బౌలర్లు.

By Medi Samrat  Published on  20 Feb 2025 4:00 PM IST
సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లా టాప్ లేపారు భారత బౌలర్లు. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన బంగ్లా తొలి రెండు ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. రెండు ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది.

మొద‌టి ఓవ‌ర్ లో ష‌మీ ఒక వికెట్ తీస్తే, రెండో ఓవ‌ర్ లో హ‌ర్షిత్ రాణా రెండో వికెట్ ప‌డ‌గొట్టాడు. ష‌మీ.. మెహ‌దీ హ‌స‌న్ మీరాజ్‌ను పెవిలియ‌న్ కి పంపి మూడో వికెట్ తీశాడు. అనంత‌రం బౌలింగ్ కి దిగిన అక్ష‌ర్ ప‌టేల్ త‌న తొలి ఓవ‌ర్ లోనే రెండు వికెట్లు తీసి టాప్ లేపాడు. అక్షర్ కు హ్యాట్రిక్ పడే అవకాశం లభించింది. అయితే స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంలో విఫలమవడంతో అక్షర్ మూడో వికెట్ ను తీయలేకపోయాడు. 35 ప‌రుగుల‌కే 5 కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇక కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో తౌహీద్‌ హృదోయ్‌ ఇచ్చిన క్యాచ్‌ను పట్టలేకపోయాడు హార్దిక్ పాండ్యా.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ లో ముగ్గురు ఆల్‌రౌండ‌ర్ల‌తో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజాలు జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మ‌హ్మ‌ద్ ష‌మీతో పాటు హ‌ర్షిత్ రాణాను తీసుకుంది. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ను ఎంపిక చేసుకుంది.

భారత జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ.

బంగ్లా జ‌ట్టు: తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీప‌ర్‌), జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మ‌ద్‌, ముస్తాఫిజుర్ రెహమాన్.

Next Story