454 రోజుల తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టిన రిషబ్ పంత్
భారత క్రికెట్ అభిమానులకు డిసెంబర్ 30, 2022 ఉదయం చాలా విచారకరమైన వార్తను అందింది. న్యూ ఇయర్ సందర్భంగా
By Medi Samrat Published on 23 March 2024 4:15 PM ISTభారత క్రికెట్ అభిమానులకు డిసెంబర్ 30, 2022 ఉదయం చాలా విచారకరమైన వార్తను అందింది. న్యూ ఇయర్ సందర్భంగా తన తల్లిని కలిసేందుకు రూర్కీ వెళ్తున్న భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది. అతని మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అతను నిలబడగలడా లేదా అని అనుకున్నారు. కానీ పంత్ సంకల్ప శక్తి,, BCCI, NCA తోడ్పాటు, అభిమానుల ప్రార్థనలతో అది అసాధ్యమైనది కూడా సాధ్యమైంది. అతను క్రికెట్ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టాడు.
IPL 2024 రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ 454 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి పెట్టాడు. డేవిడ్ వార్నర్ అవుటయ్యాక పంత్ క్రీజులోకి అడుగుపెట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి వికెట్ కీపర్‌గా ఆడేందుకు రిషబ్ పంత్‌కు బీసీసీఐ అనుమతించింది. అటువంటి పరిస్థితితులలో జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ కూడా అతని ఎంపికకు తలుపులు తెరిచే ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ వికెట్ కీపింగ్ చేస్తే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కావచ్చని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్ల చూపు రిషబ్ పంత్ పైనే ఉంటుంది. ఇప్పటికే జితేష్ శర్మను టీమ్ పరీక్షించింది. అతనితో పాటు ధృవ్ జురెల్, సంజు శాంసన్ కూడా భారత జట్టు తలుపు తడుతున్నారు. KL రాహుల్ కూడా ఒక ఎంపిక. కానీ అతని ఫిట్‌నెస్ సమస్య అలాగే ఉంది.