గతేడాది డిసెంబర్ లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం పంత్ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే పంత్ ఆ గాయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. చాలా రోజుల తరువాత బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నట్లు అందులో తెలిపాడు.
బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆల్ ఈజ్ వెల్ అంటూ పంత్ ఇన్‌స్ట్రామ్‌లో స్టోరీస్‌లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోను బట్టి చూస్తుంటే ఆస్పత్రి ఆవరణలోని ప్రదేశమే అని అర్థం అవుతుంది.
గాయం కారణంగా పంత్ క్రికెట్ ఆడడం ఇప్పట్లో సాధ్యం కాదు. మోకాళ్లకు శస్త్ర చికిత్స కావడంతో అతడు మైదానంలో అడుగుపెట్టడానిక దాదాపు ఆరు నుంచి నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్ మొత్తానికే దూరం కానున్నాడు. అంతేకాకుండా పలు కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరం అవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్, భారత్ అతిథ్యం ఇస్తున్న వన్డే ప్రపంచకప్‌లలో పంత్ ఆడే అవకాశం లేదు.