బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్
Rishabh Pant Injured After Car Collides With Divider.రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
By తోట వంశీ కుమార్ Published on
30 Dec 2022 3:58 AM GMT

టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తరాఖండ్ నుండి పంత్ ఢిల్లీలోకి మెర్సిడెస్ కారులో వెలుతుండగా రూర్కీ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు పంత్ కారు విండో అద్దాలు పగులగొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి తల, మోకాలు, భుజాలకు గాయలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పంత్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో పంత్ స్వయంగా కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బంగ్లాతో ముసిగిన టెస్టు సిరీస్‌లో పంత్ ఆడాడు. అయితే.. జనవరి 3 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌లకు పంత్‌ను ఎంపిక చేయలేదు. కాగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి క్రిస్మిస్ వేడుకలను పంత్ దుబాయ్‌లో చేసుకున్న సంగతి తెలిసిందే.
Next Story