మారడోనాకు బదులు మడోనాకు నివాళులు.. వైరల్ అవుతున్న పోస్ట్ లు
RIP Madonna trends online after Twitter users mistake her for Maradona. ఫుల్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on
27 Nov 2020 5:06 AM GMT

ఫుల్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిగో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మారడోనాకు నివాళులు అర్పించారు. అయితే.. కొందరు పొరబాటున మారడోనాకు బదులు పాప్‌సింగర్ మడోనాకు నివాళులర్పించారు. రెస్ట్ ఇన్ పీస్ మడోనా.. నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటావు అని ఒకరు ట్వీట్ చేయగా.. అసలు నువ్వు ఫుట్‌బాల్ ఆడతావన్న విషయం కూడా నాకు తెలియదు.. నువ్వు అత్యుత్తమ ప్లేయర్స్‌లో ఒకరు అని మరొకరు ట్వీట్ చేయడం విశేషం.
ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు మారడోనాకు బదులుగా రిప్ మడోన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొకరైతే మరో అడుగు ముందుకేసి రెస్ట్ ఇన్ పీస్ మడోనా.. క్వీన్ ఆఫ్ ఫుట్‌బాల్ అని ట్వీట్ చేశారు. తమ అభిమాన సింగర్ మృతిని జీర్ణించుకోలేపోతున్నామని విలపించారు. ఆమె పాటలు, వీడియోలో షేర్ చేస్తూ నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'రిప్ మడోన్నా' అనే ట్వీట్‌కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Next Story