తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  17 Jan 2024 3:28 PM IST
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆయ‌నకు ప్ర‌స్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఆయ‌న ఆరోగ్యంపై ఆసుప‌త్రి యాజ‌మాన్యం తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. రానున్న 48 గంటలు ముఖ్యమని, వివిధ విభాగాల వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారని బులెటిన్‌లో తెలిపింది. తమ్మినేని బీపీ కంట్రోల్‌లో ఉందని... ప్రస్తుతం ఆయన మాట్లాడగలుగుతున్నారని పేర్కొంది. బీపీ లెవల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్‌కు చేరుకున్నట్లు తెలిపింది. లంగ్స్‌లో ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఐసీయూలో వెంటిలెటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ్మినేని మంగళవారం త‌న ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత‌రం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

Next Story