ఈ కారణాల వల్లే ట్రోఫీని గెలవలేదు.. ఆర్సీబీ బలహీనత ఏమిటో చెప్పిన‌ ఏబీ డివిలియర్స్..!

గత కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు

By Medi Samrat  Published on  29 Nov 2023 5:35 PM IST
ఈ కారణాల వల్లే ట్రోఫీని గెలవలేదు.. ఆర్సీబీ బలహీనత ఏమిటో చెప్పిన‌ ఏబీ డివిలియర్స్..!

గత కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. 39 ఏళ్ల డివిలియర్స్‌కు ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ జట్టులోకి ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చినా.. ఇప్పటి వరకూ ఆ జ‌ట్టు ఫేట్ మారలేదు. ఆర్సీబీ జట్టు ఇంకా మొదటి టైటిల్ కోసం పోరాటం చేస్తూనే ఉంది.

చిన్నస్వామి స్టేడియం విస్తీర్ణం దృష్ట్యా ఇక్కడ బౌలింగ్ చేయడం కాస్త కష్టమేనని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఇది కాకుండా ఒత్తిడి సమయాల్లో జట్టు సంయమనం పాటించడంలో విఫలమైంది. ప్రతిసారీ నిరాశ చెందడానికి ఇదే కారణమ‌న్నాడు.

'గత కొన్నేళ్లుగా RCB బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉంది అని అందరికీ తెలుసు. బ్యాట్స్‌మెన్ కూడా చాలాసార్లు పొరపాట్లు చేశారు. అయితే అంద‌రూ జట్టుగా ఆడాలి. జట్టుగా కలిసి మెలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అన్నారు. జట్టు ఒత్తిడిలో వెర్రి తప్పులు చేయడం, క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమవడం తరచుగా కనిపిస్తుంది. చిన్నస్వామి స్టేడియంలో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో తెలుసు. ఇవ‌న్నీ అధిగ‌మించాల‌ని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.

ఇదిలావుంటే.. ఐపీఎల్‌- 2024 వేలానికి ముందు RCB కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్‌లను టీమ్ వ‌దులుకుంది. మహ్మద్ సిరాజ్ నాయకత్వంలో కొత్త‌ బౌలింగ్ విభాగాన్ని త‌యారుచేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

Next Story