ఆర్సీబీ మీద విరుచుకుపడిన గౌతమ్ గంభీర్

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తిపోరు జరగనుంది. ముఖ్యంగా నైట్ రైడర్స్ కు మెంటార్ గా గంభీర్ వచ్చేయడంతో

By Medi Samrat  Published on  29 March 2024 3:04 PM
ఆర్సీబీ మీద విరుచుకుపడిన గౌతమ్ గంభీర్

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తిపోరు జరగనుంది. ముఖ్యంగా నైట్ రైడర్స్ కు మెంటార్ గా గంభీర్ వచ్చేయడంతో మరోసారి ఏమి జరుగుతుందా ఈ రెండు జట్ల మధ్య అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అంతేకాకుండా ఆర్సీబీ మీద గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేను కలలో కూడా ప్రతిసారీ ఓడించాలనుకున్న ఒక జట్టు RCB. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు ఉన్న జట్టు అది. నిజాయితీగా మాట్లాడాలంటే ఆ జట్టు ఇప్పటిదాకా ఏమీ గెలవలేదు, అయితే అన్నీ గెలిచామనే అనుకుంటున్నారు. అలాంటి వైఖరిని నేను ఏ మాత్రం తీసుకోలేను. బహుశా KKR సాధించిన మూడు అత్యుత్తమ విజయాలు RCBపైనే" అని గౌతమ్ గంభీర్ వీడియోలో పేర్కొన్నాడు. "నా క్రికెట్ కెరీర్‌లో నేను కోరుకునేది మైదానంలోకి వెళ్లి RCBని ఓడించడం." అని చెప్పుకొచ్చాడు గంభీర్. ఆర్సీబీని ఓడించడం అంటే నాకు చాలా ఇష్టం.. నేడు జరిగే మ్యాచ్ లోను మేము ఆర్సీబీని ఓడిస్తాం.. అందుకోసం సన్నాహాలు చేస్తున్నామని గంభీర్ తెలిపాడు.

Next Story