రవీంద్ర జడేజా ఇంట్లో గొడవలకు ఆమె కారణమైందా.?

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి.. అనిరుధ్‌సింగ్ జడేజా ఇచ్చిన ఇంటర్వ్యూను ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించింది.

By Medi Samrat  Published on  9 Feb 2024 8:15 PM IST
రవీంద్ర జడేజా ఇంట్లో గొడవలకు ఆమె కారణమైందా.?

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి.. అనిరుధ్‌సింగ్ జడేజా ఇచ్చిన ఇంటర్వ్యూను ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించింది. అందులో రవీంద్ర జడేజా తండ్రి నిజం చెప్పాలంటే నాకు, నా కొడుకు రవీంద్ర జడేజాకి, అతని భార్య రివాబాకి అనుబంధం సరిగా లేదని అన్నారు. మేం రవీంద్ర జడేజాకు ఫోన్ చేయడం లేదు.. అతను మాకు ఫోన్ కాల్స్ చేయడం లేదని తేల్చి చెప్పారు. పెళ్లైన రెండు మూడు నెలల నుంచే తమ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని.. మేం ప్రస్తుతం జామ్‌నగర్‌లో ఉంటున్నామన్నారు. రవీంద్ర జడేజా వేరే బంగ్లాలో ఉంటున్నాడని అన్నారు. జామ్‌నగర్‌లోనే జడేజా ఉన్నప్పటికీ మమ్మల్ని చూడడానికి వచ్చి చాలా రోజులే అయ్యిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

రవీంద్ర జడేజా మాత్రం తన తండ్రి ఆరోపణలను కొట్టిపారేశారు. జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలను విశ్వసించవద్దని కోరారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత ఆల్ రౌండర్ చెప్పాడు. జడేజా ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నాడు. జడేజా సకాలంలో కోలుకుని రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో జరిగే చివరి 3 టెస్టులకు భారత జట్టులోకి వస్తాడో లేదో చూడాలి.

Next Story