చెన్నైకి జ‌డేజా గుడ్ బై..? అందుకే అలా చేశాడా..?

Ravindra Jadeja deletes Instagram posts on CSK.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ కు టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2022 7:08 AM GMT
చెన్నైకి జ‌డేజా గుడ్ బై..?  అందుకే అలా చేశాడా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ కు టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. వ‌చ్చే ఏడాది నుంచి చెన్నై జ‌ట్టు త‌రుపున జ‌డేజా ఆడ‌డం లేదా..? ఆ జ‌ట్టుకు గుడ్ బై చెప్ప‌నున్నాడా..? అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అదే నిజమ‌ని అనిపిస్తోంది. జ‌డేజా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై జ‌ట్టుకు సంబంధించిన అన్ని పోస్టుల‌ను డిలీట్ చేశాడు. దీంతో చెన్నై జ‌ట్టుతో జ‌డేజాకు విభేదాలు త‌లెత్తిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ 15వ సీజ‌న్ ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నై జ‌ట్టు కెప్టెన్‌గా జ‌డేజాను నియ‌మించారు. అయితే.. జ‌డేజా సార‌ధ్యంలో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కేవ‌లం రెండు మ్యాచుల్లోనే చెన్నై విజ‌యం సాధించింది. సార‌ధిగా మాత్ర‌మే కాకుండా అటు ఆట‌గాడిగానూ జ‌డ్డూ విఫ‌లం అయ్యాడు. దీంతో సార‌ధ్య బాధ్య‌త‌లు వ‌దులుకోగా తిరిగి ధోని కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అనంత‌రం కొద్ది రోజులోనే గాయం కార‌ణంగా ఐపీఎల్ టోర్నీ నుంచి జ‌డ్డూ త‌ప్పుకున్నాడు.

అప్ప‌ట్లోనే.. గాయం కేవ‌లం సాకు మాత్ర‌మేన‌ని చెన్నై జ‌ట్టుతో విభేదాల కార‌ణంగానే జ‌డేజా త‌ప్పుకున్నాడ‌నే వార్తలు వినిపించాయి. తాజాగా చెన్నై జ‌ట్టుకు సంబంధించిన పోస్టుల‌ను జ‌డేజా తొల‌గించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ప్ర‌తి సంవ‌త్స‌రం ధోని పుట్టిన రోజుకి శుభాకాంక్ష‌లు తెలిపే జ‌డేజా ఈ సారి మాత్రం అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డం కూడా అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

అటు చెన్నై సూప‌ర్ కింగ్స్ గానీ ఇటు ర‌వీంద్ర జ‌డేజా కానీ ఇంత వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు స్పందిస్తే త‌ప్ప అస‌లు నిజం ఏమిట‌నేది తెలియ‌దు.

Next Story
Share it