Video : సిరీస్ మ‌ధ్య‌లో రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఏమ‌య్యిందంటే..?

భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on  18 Dec 2024 6:23 AM GMT
Video : సిరీస్ మ‌ధ్య‌లో రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఏమ‌య్యిందంటే..?

భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల వయసులో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు జరుగుతోంది. మూడో టెస్టులో ఐదో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 260 పరుగులకు ముగించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం వెలుతురు సరిగా లేకపోవడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను డ్రాగా నిర్ణయించారు.

ఇంతలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించింది. ఆర్ అశ్విన్, కోహ్లీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ సమయంలో అశ్విన్ భావోద్వేగానికి లోనవగా, కోహ్లీ అతన్ని కౌగిలించుకున్నాడు.

వైరల్ ఫోటోలో విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నట్లు, ఇద్దరూ సీరియస్‌గా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అతని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఈ సమయంలో అశ్విన్ కోహ్లీకి ఏదో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.కోహ్లి వెంటనే అతన్ని కౌగిలించుకున్నాడు. దీంతో గాబా టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే ఊహాగానాలకు దారితీసింది.

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 38 ఏళ్ల అశ్విన్‌కు ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం లభించింది. ఆర్ అశ్విన్ అడిలైడ్ టెస్టులో ప్లేయింగ్-11లో చోటు సంపాదించాడు, అందులో అతను రాణించ‌లేదు. అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అశ్విన్‌కు ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.

భారత అత్యుత్తమ స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకడు. అతని గణాంకాలు దీనికి సాక్ష్యమిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బౌలర్. అశ్విన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో గొప్ప రికార్డులు సాధించాడు.

అశ్విన్‌కి సంబంధించిన కొన్ని పెద్ద రికార్డులు ఇక్క‌డ చూద్ధాం..

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌ - 537

భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 5 వికెట్లు - 37

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు - 11, మురళీధరన్‌తో సమానం

ఉత్తమ బౌలింగ్ స్ట్రైక్ రేట్ - 50.7 (200+వికెట్లు)

Next Story