'ధమాకా' సూపర్ వసూళ్లు

Ravi Teja Dhamaka Movie First Day Collection. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ధమాకా సినిమా థియేటర్లకు వచ్చింది.

By Medi Samrat  Published on  24 Dec 2022 11:45 AM GMT
ధమాకా సూపర్ వసూళ్లు

రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ధమాకా సినిమా థియేటర్లకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 10 కోట్లకి పైగా రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం వదిలింది.


ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదల అయ్యింది. ధమాకా సినిమాను మొత్తం మీద 40 కోట్ల బడ్జెట్ లో నిర్మించినట్లు సమాచారం. రవితేజ సినిమాకు బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా కి మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఓవరాల్ గా 32 కోట్ల దాకా జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 18.30 కోట్ల రేంజ్ లో జరిగిందని చెబుతున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లుకు పలికాయని.. శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు.


Next Story
Share it