ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే: రవిశాస్త్రి

Ravi Shastri Picks This Team As Favourites To Win IPL 2023 Title. ఐపీఎల్ 2023 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆప్స్ కు చేరడానికి అన్ని జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి

By Medi Samrat
Published on : 5 May 2023 4:45 PM IST

ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే: రవిశాస్త్రి

Ravi Shastri


ఐపీఎల్ 2023 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆప్స్ కు చేరడానికి అన్ని జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ప్రకారం అద్భుతం జరిగితే తప్ప ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ప్లే ఆప్స్ కు చేరలేవు. ఇక మిగిలిన వాటిలో చాలా వాటికి ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక టైటిల్ గెలిచే జట్లపై ఒక్కో క్రికెట్ లెజెండ్.. ఒక్కో జట్టు పేరు చెబుతున్నాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా టైటిల్ గెలిచే జట్టు గురించి ఓ ప్రకటన చేశారు.

భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఐపిఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ను టైటిల్ ఫేవరెట్‌ అని చెప్పుకొచ్చాడు. దీనికి కారణం ఆ జట్టు సమతూకంగా ఉండడమేనని.. అంతేకాకుండా ఒక జట్టుగా సమిష్టిగా రాణిస్తోందని అన్నారు. ప్రస్తుత ఫామ్.. టీమ్ స్టాండింగ్‌లను చూస్తుంటే, గుజరాత్ ట్రోఫీని గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ జట్టులో నిలకడ, ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏడు-ఎనిమిది మంది ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇక సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ని నడిపిస్తున్న విధానాన్ని కూడా ప్రశంసించారు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ "సంజు శాంసన్ కెప్టెన్‌గా పరిణితి చెందాడు. అతను తన స్పిన్నర్లను బాగా ఉపయోగించుకుంటాడు. మంచి కెప్టెన్ మాత్రమే ముగ్గురు స్పిన్నర్లతో ఆడగలడు.. వారిని తెలివిగా ఉపయోగించుకోగలడు" అని చెప్పుకొచ్చారు.


Next Story