RR vs SRH : తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓట‌మి

Rajasthan Royals secure dominating victory against SunRisers Hyderabad. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ విజ‌యంతో ప్రారంభించింది.

By Medi Samrat  Published on  2 April 2023 7:53 PM IST
RR vs SRH : తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓట‌మి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ విజ‌యంతో ప్రారంభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్ఆర్ 20 ఓవర్లలో 203/5 భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ఆదిన్ మార్కుమ్ లేకపోవడంతో భువనేశ్వ‌ర్ కుమార్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంది. రాజస్థాన్‌ తరఫున జోష్ బట్లర్ 22 బంతుల్లో 54 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్ కూడా 37 బంతుల్లో 54 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హైదరాబాద్ కు తొలి ఓవర్ లోనే ట్రెంట్ బౌల్ట్ వ‌రుస‌ షాక్ లు ఇచ్చాడు. ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ల‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ ఇన్నింగ్స్ పేక‌మేడ‌లా కూలింది. చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో SRH 131/8కి పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Next Story