టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్

Rajasthan Royals opt to bowl. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్

By Medi Samrat  Published on  5 April 2023 7:42 PM IST
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్

ఐపీఎల్ లో భాగంగా గువాహటి వేదికగా కింగ్స్ లెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ తమ తొలి మ్యాచుల్లో విజయం సాధించి రెండో విజయంపై కన్నేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పు లేదని టాస్‌ సమయంలో శాంసన్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ కూడా అదే జట్టుతో ఆడుతోంది.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (WK), సంజు శాంసన్ (c), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (c), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), భానుక రాజపక్స, సికందర్ రజా, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.


Next Story