తొలి వ‌న్డే జ‌రిగేది అనుమాన‌మే..!

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిసెంబర్ 17న భారత కాలమానం

By Medi Samrat  Published on  16 Dec 2023 3:15 PM IST
తొలి వ‌న్డే జ‌రిగేది అనుమాన‌మే..!

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిసెంబర్ 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విజయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వాతావరణ శాఖ నుండి వచ్చిన అప్‌డేట్ అభిమానులను నిరాశపరచ‌నుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం క‌లిగించే అవకాశం ఉంది. దీని వల్ల మ్యాచ్ ఓవర్లు కుదించే అవ‌కాశం లేదా మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు.

ఈ సిరీస్‌లోని తొలి వన్డే జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. వన్డే సిరీస్ అయినా ఫ‌లితం వ‌స్తుందేమో అంటే వ‌ర్షం అడ్డంకిగా మారింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చని డిపార్ట్‌మెంట్ తెలిపింది. వర్షం కురిసే అవకాశం 51 శాతం వరకు ఉంటుందని వెల్ల‌డించింది. మ్యాచ్ జరిగే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ , గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని పేర్కొంది. వన్డే సిరీస్ కోసం భారత జట్టులో ప‌లు మార్పులు చేశారు. ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Next Story