ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్‌లో ఎలాంటి మార్పు చేయ‌లేదుగా..!

అన్ని ఊహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా

By Medi Samrat  Published on  29 Nov 2023 9:04 AM GMT
ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్‌లో ఎలాంటి మార్పు చేయ‌లేదుగా..!

అన్ని ఊహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. బీసీసీఐ ద్ర‌విడ్‌ పదవీకాలాన్ని పొడిగించింది. అలాగే కోచింగ్ సిబ్బందిలో కూడా ఎలాంటి మార్పుచేయ‌లేదు. దీంతో ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా.. విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా, పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్ తర్వాత కాంట్రాక్ట్ గడువు ముగియడంతో బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌తో ఫలవంతమైన చర్చలు జరిపి పదవీకాలాన్ని పొడిగించేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత జట్టును నిర్మించడంలో ద్రవిడ్ ముఖ్యమైన పాత్రను బోర్డు గుర్తించింది. అతని అసాధారణమైన వృత్తి నైపుణ్యాన్ని అభినందిస్తుంది.

NCA చీఫ్, స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్ పాత్రను కూడా బోర్డ్ అభినందిస్తుంది. వారిద్ద‌రి ఆన్-ఫీల్డ్ భాగస్వామ్యాల మాదిరిగానే.. ద్రవిడ్, లక్ష్మణ్ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేశారని వెళ్ల‌డించింది.

పదవీకాలం పొడిగింపుపై ద్రవిడ్ మాట్లాడుతూ.. “టీమ్ ఇండియాతో గత రెండేళ్లు పూర్తిగా చిరస్మరణీయమైనవి. మేము హెచ్చు తగ్గులు చూశాము. ఈ ప్రయాణంలో జట్టు మద్దతు, స్నేహ పూరిత వాతావ‌ర‌ణం ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆట‌గాళ్లు, మేం ఉన్న‌ సంస్కృతికి నేను నిజంగా గర్వపడుతున్నాను. మా బృందంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ అపూర్వం. నాపై నమ్మకం ఉంచి.. నా విజన్‌కు మద్దతునిచ్చినందుకు, సహాయాన్ని అందించినందుకు బీసీసీఐ, ఆఫీస్ బేరర్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.


Next Story