టాస్ గెలిచిన పంజాబ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నేడు మరో సమరానికి సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది.

By Medi Samrat  Published on  9 April 2024 7:27 PM IST
టాస్ గెలిచిన పంజాబ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నేడు మరో సమరానికి సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్ రైజర్స్ ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడగా రెండింట విజయం సాధించింది. ఇక పంజాబ్ జట్టు ఎప్పుడు గెలుస్తుందో.. ఎప్పుడు ఓడిపోతుందో తెలియని పరిస్థితి. ఈ విజయం రెండు జట్లకు చాలా ముఖ్యమే!! పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి వెళ్ళడానికి ఈ మ్యాచ్ విజయం సాయం చేస్తుంది.

తుది జట్లు:

సన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనద్కత్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్షదీప్ సింగ్.

Next Story