రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ పృథ్వీ షా కెరీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా తప్పుడు మార్గంలో వెళ్లి తన క్రికెట్ కెరీర్‌ను పాడు చేసుకున్నాడని అభిప్రాయ పడ్డాడు. భారత్ కు నెక్స్ట్ సచిన్ అంటూ పేరు తెచ్చుకున్న పృథ్వీ షా 2024-25 సీజన్ సమయంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టు నుండి తొలగించబడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కూడా అతడిని విడుదల చేసింది. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) మెగా వేలంలో కూడా అతను అమ్ముడుపోలేదు.
రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్.. పృథ్వీ షా ఒక అద్భుతమైన ఆటగాడిగా వెలుగులోకి వచ్చిన తొలి రోజులను గుర్తుచేసుకున్నాడు. షా తన బాల్యం నుండే అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడని, కానీ దురదృష్టవశాత్తు తన మార్గాన్ని వదిలి తన ఆటను పాడుచేసుకున్నాడని వెల్లడించాడు. పృథ్వీని బాల్యం నుండే చూశానని, చాలా ప్రతిభావంతుడైన ఆటగాడన్నాడు. అతని జీవితంలో ఏమి జరిగిందో ఖచ్చితంగా తెలియదని స్పష్టం చేశాడు.