టీమిండియాకు కోలుకోలేని షాక్.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 4 Jan 2025 3:02 PM ISTబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రెండో రోజు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆ తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆట ముగిసిన తర్వాత బుమ్రా గాయం గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. బుమ్రా గాయం గురించి సహచర బౌలర్ అప్‌డేట్ ఇచ్చాడు.
రెండో రోజు స్టంప్స్ తర్వాత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతన్ని పర్యవేక్షిస్తోంది.. కాబట్టి వేచి చూద్దాం" అని కృష్ణ అన్నారు. నివేదికలను విశ్వసిస్తే.. మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బ్యాటింగ్‌కు రాలేడు.
సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు గాయం అవడంతో టీమిండియా తీవ్రపరిణామాలు ఎదుర్కోనుంది. సిడ్నీ టెస్టు రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా కొంత ఇబ్బంది పడ్డాడు. బుమ్రా రెండవ సెషన్‌లో మైదానం నుండి నిష్క్రమించాడు. తొలి సెషన్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ బుమ్రా మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒక ఓవర్ తర్వాత మైదానం వీడాడు. ఆ తర్వాత బుమ్రాను వైద్యబృందం స్కాన్ చేసింది. బుమ్రాకు వెన్నునొప్పి ఉన్నట్లు తేలింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 13.06 సగటుతో 32 వికెట్లు తీశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.