తన వన్డే కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడకుండా సహాయం చేయమని సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటర్ ఎబి డివిలియర్స్‌ను కోరాడు. సూర్యకుమార్ 2023 ప్రపంచ కప్‌లో భారతజట్టులో భాగంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ చివరి సారిగా ఆడాడు. 35 ఏళ్ల సూర్యకుమార్ T20 ఫార్మాట్‌లో రాణించాడు.
37 ODIలలో, సూర్యకుమార్ 25.76 సగటుతో 773 పరుగులు చేశాడు,నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రస్తుత భారత T20I కెప్టెన్ ప్రదర్శన విమర్శలకు దారి తీసింది. అప్పటి నుండి 50 ఓవర్ల జట్టులో భాగమవ్వలేదు. విమల్ కుమార్ తో సూర్యకుమార్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ వన్డేలు, టీ20లు రెండింటిలో ఎలా సమర్థవంతంగా ప్రదర్శన చేశాడో అడిగి తెలుసుకున్నానని చెప్పాడు. వన్డేలు కూడా టి20ల మాదిరిగానే ఆడాలని తనకు కూడా ఉందని సూర్య చెప్పాడు.
సూర్యకుమార్ కలవాలని అనుకున్నట్లుగా సందేశాన్ని డివిలియర్స్‌కు పంపాడు. రాబోయే మూడు నుండి నాలుగు సంవత్సరాలలో వన్డేల్లో రాణించాలని అనుకుంటున్నట్లు, త్వరగా తనను సంప్రదించమని డివిలియర్స్ ను కోరాడు.