ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ నేడు వెళ్ళనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాకు చేరుకుంటారు. కోటప్పకొండకు చెందిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. కోటప్పకొండ - కొత్తపాలెం మధ్య నిర్మించిన 3.9 కోట్ల రోడ్డును ప్రారంభించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ గా రివ్యూ నిర్వహిస్తారు.