కేవలం ఇద్దరికీ మాత్రమే భారత్‌లో ఆడిన అనుభవం.. వరల్డ్ కప్‌లో పాక్ టీమ్ పరిస్థితేంటి..!
ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. పాక్ వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 29 Sept 2023 6:37 PM ISTఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. పాక్ వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆ జట్టు హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. విశేషమేమిటంటే.. బాబర్ అజామ్‌తో సహా చాలా మంది యువ ఆటగాళ్లు భారత పిచ్‌లపై ఎప్పుడూ ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ జట్టుకు సవాల్ తప్పదని భావిస్తున్నారు.
భారత్‌కు వచ్చిన జట్టులో అత్యధికులు దేశంలో ఆడటం ఇదే తొలిసారి. 2012–13 నుంచి పాకిస్థాన్, భారత్‌లు ఏ ఫార్మాట్‌లోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. పాకిస్థాన్ చివరిసారిగా వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటించింది. 2016లో టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది.
పాకిస్థాన్ జట్టులో ఉన్న మహ్మద్ నవాజ్, సల్మాన్ అలీ మాత్రమే భారతదేశంలో క్రికెట్ ఆడారు. వాస్తవానికి, నవాజ్ 2016లో T20 ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించాడు, కానీ అతడు టోర్నమెంట్‌లో ఏ మ్యాచ్‌నూ ఆడలేకపోయాడు. అప్పటికీ అతని వయసు 21 సంవత్సరాలు. జట్టుకు షాహిద్ అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అఘా సల్మాన్ భారల్‌లో పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు, కానీ అతడు లీగ్ మ్యాచ్ ఆడటానికి భారతదేశానికి వచ్చాడు. వాస్తవానికి, అతడు ఛాంపియన్స్ లీగ్ T20లో లాహోర్ లయన్స్ జట్టులో భాగమయ్యాడు. అతడు డాల్ఫిన్స్‌తో మ్యాచ్ ఆడాడు. అందులో అతడు 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. వీరు తప్పించి జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లు భారత్‌లో ఎప్పుడూ ఆడలేదు. అయితే పాక్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టు :
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అగా , షాహీన్ షా అఫ్రిది, ఉసామా మీర్.