పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో భారీ ఆర్థిక అవినీతి బయటపడింది. ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఈ అవకతవకలు మొత్తం 600 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆడిట్ రిపోర్ట్ ప్రకారం, టికెటింగ్ కాంట్రాక్టులు, మీడియా హక్కులు, బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాలు పారదర్శకత లేకుండా కేటాయించినట్టు గుర్తించారు. రూ.500 కోట్ల స్పాన్సర్‌షిప్ మొత్తం రికవరీ కాకపోవడం ఆడిట్‌లో బయటపడింది. రూ.43.9 కోట్ల మీడియా హక్కులను రిజర్వ్ ధర కంటే తక్కువకు ఇచ్చినట్లు గుర్తించబడింది.
అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో భద్రత కోసం పోలీసులకు భోజన ఖర్చుల కింద రూ.6.3 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. 2023 ఫిబ్రవరి నుంచి జూన్ 2024 వరకు పీసీబీ చైర్మన్‌కు యుటిలిటీ ఛార్జీలు, ఇంధనం, వసతి కోసం రూ.41 లక్షలు అనధికారంగా చెల్లించినట్లు రిపోర్ట్ వెల్లడించింది.