ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!

బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది

By Medi Samrat  Published on  17 Oct 2024 9:14 AM GMT
ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!

బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో రోజు చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ముందుగా బౌలింగ్ చేస్తారని భావించినా.. కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్నస్వామిలోని పిచ్ పరిస్థితులు తెలిసి.. తేమ ఉన్నప్పటికీ రోహిత్ బ్యాటింగ్ నిర్ణయించుకోవడం ఎంత త‌ప్పో నిరూపిత‌మైంది. రోహిత్ అనాలోచిత నిర్ణ‌యంతో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.

మ్యాచ్ చూసినంతసేపు.. ఇది ఏ రకంగానూ టెస్టు మ్యాచ్‌లా కనిపించ లేదు. టీమ్ ఇండియా ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు.. టీమ్ ఇండియా 34/6 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత మ‌రో 12 ప‌రుగులు చేసి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయి 46 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ల‌లో య‌శ‌స్వీ జైస్వాల్‌(13), పంత్‌(20) త‌ప్ప అంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భారత్‌కు చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెర‌వ‌కుండానే అవుట్ అయ్యారు. న్యూజీలాండ్ బౌల‌ర్ల‌లో విలియ‌మ్ నాలుగు, హెన్వీ ఐదు, సౌతి ఒక వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ మొద‌లుపెట్టిన న్యూజీలాండ్ 15.4 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోకుండా 56 ప‌రుగులు చేసి తొలి ఇన్నింగ్సులో 10 ప‌రుగుల ఆధిక్యంతో ఉంది.

Next Story