ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన గుయెన్ థో టామ్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ టైటిళ్లను సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. నిఖత్ 2022లో 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌లో భారత్ మూడు స్వర్ణాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో 48 కేజీలు విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల విభాగంలో సావీటీ బూరా విజేతలుగా నిలిచారు. లోవ్లినా బోర్గోహైన్ 75 కేజీల విభాగం ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌తో పోటీపడనుంది.