డిఫెండింగ్ ఛాంపియన్ కు మొదటి మ్యాచ్ లోనే భంగపాటు

New Zealand hammer Australia by 89 runs. టీ20 ప్రపంచ కప్ 2022లో సూపర్ 12 లో భాగంగా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నడుమ

By Medi Samrat  Published on  22 Oct 2022 11:17 AM GMT
డిఫెండింగ్ ఛాంపియన్ కు మొదటి మ్యాచ్ లోనే భంగపాటు

టీ20 ప్రపంచ కప్ 2022లో సూపర్ 12 లో భాగంగా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నడుమ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 200 స్కోర్ చేసింది. దీంతో 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ విజయం వైపు అడుగులు వేయలేదు.. చివరికి 17.1 ఓవర్లకు 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్ లో ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్ (13), మిచెల్ మార్ష్ (16), మార్కస్ స్టొయినిస్ (7), టిమ్ డేవిడ్ (11), మాథ్యూ వేడ్ (2), మిచెల్ స్టార్క్ (4), ఆడమ్ జంపా (0), జోష్ హాజిల్‌వుడ్ (1 నాటౌట్) పరుగులు చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్ (21) పర్వాలేదనిపించాడు. ఆసీస్ జట్టు 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది.

టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42), డేవాన్ కాన్వే (58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23), గ్లెన్ ఫిలిప్స్ (12) తక్కువ పరుగులు చేసినా.. జిమ్మీ నీషమ్ (13 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ స్కోరును 200 మార్కు దాటించాడు.


Next Story