టీ20 వరల్డ్‌కప్‌లో గెలుపు బోణీకొట్టిన న్యూజిలాండ్

టీ-20 వరల్డ్‌కప్‌ గ్రూప్-డి లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది

By -  Knakam Karthik
Published on : 8 Feb 2026 3:18 PM IST

T20 World Cup, Sports News, New Zealand, Afghanistan

టీ20 వరల్డ్‌కప్‌లో గెలుపు బోణీకొట్టిన న్యూజిలాండ్

టీ-20 వరల్డ్‌కప్‌ గ్రూప్-డి లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ జట్టు 17.5 ఓవర్లలోనే ఛేదించి టోర్నీలో తమ తొలి గెలుపును నమోదు చేసుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుల్బాదిన్ నయిబ్ (63 పరుగులు, 35 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఆదరగొట్టాడు. సిద్దికిస్ అతుల్ (29 పరుగులు), రహ్మానుల్లా గుర్బాజ్ (27 పరుగులు), డార్విష్ రసోయ్ (20 పరుగులు) ఫర్వాలేదనిపించారు. లాకీ ఫెర్గ్యూసన్ 2, జకబ్ డఫ్పీ, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

Next Story