టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బౌలింగ్ యూనిట్‌లోకి సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చేశాడు. గత మ్యాచ్‌లో యూఎస్‌ఏపై టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ మంచి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దీంతో ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు ఇది మంచి అవకాశం.
భారత జట్టు :
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
నమీబియా జట్టు :
లౌరెన్ స్టీన్‌కాంప్, జాన్ ఫ్రైలింక్, జన్ నికోల్ లోఫ్టి ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జానే గ్రీన్(వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్జ్, బెన్ షికాంగో, మ్యాక్స్ హీంగో.