హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఏ మాత్రం ఆలోచించుకోకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నాం.. మంచి ట్రాక్ లాగా కనిపిస్తోందని తెలిపాడు. మేము గత గేమ్‌లో పటిష్టంగా కనిపించాం.. ఆఖర్లో సరిగ్గా ప్లాన్ చేయకపోవడం.. మేము మ్యాచ్ కోల్పోవడానికి కారణమైంది. ఇంకా 13 గేమ్‌లు మిగిలి ఉన్నాయి.. మేము సానుకూలంగా ఉన్నామని తెలిపాడు. ఆటగాళ్లందరితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను.. వారిని బాగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని అన్నాడు హార్దిక్. తమ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. లూక్ తప్పుకున్నాడని.. మఫాకా జట్టులోకి వచ్చాడని తెలిపాడు హార్దిక్. ఇక సన్ రైజర్స్ జట్టులోకి మార్కో జన్సెన్ స్థానంలో ట్రెవిస్ హెడ్ వచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఎవరు జట్టులోకి వచ్చారంటే.? ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా