ధోని అలా చేశావేంటి..? పంత్ మాటకు కాస్త కూడా విలువ లేదా..!
MS Dhoni shuts phone when Rishabh Pant tries to drag him into his Insta live.వెస్టిండీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం
By తోట వంశీ కుమార్
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం భారత కీలక ఆటగాళ్లు వెస్టిండీస్ చేరుకున్నారు. ఈ నెల 29 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ విషయాన్ని కాస్త పక్కనబెడితే యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. తన సహచరులు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.
అయితే.. ఈ లైవ్‌లోకి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని లాగేందుకు యత్నిచాడు పంత్. అయితే అంత టైమ్ లేదంటూ మహీ కాల్ కట్ చేశాడు. దీంతో రోహిత్, సూర్యకుమార్ పగలబడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ధోని భార్య సాక్షి సింగ్ కనిపించగా.. ఆమె తన ముఖాన్ని దాచడానికి ప్రయత్నించింది. అనంతరం కెమెరా ధోనివైపుకు తిప్పారు. ధోని కెమెరా వైపుకు రాగానే సూర్య, రోహిత్, పంత్‌లు హాయ్ చెప్పగా ధోని కూడా హాయ్ చెప్పాడు. ఇంతలో పంత్.. 'మహీ బాయ్ ఎలా ఉన్నావ్..? మేం లైవ్ కాల్ ఉన్నాం.. కాసేపు మాతో గడుపు' అని అన్నాడు. పంత్ ఈ మాట అనగానే అంత టైమ్ లేదు అంటూ ధోని కాల్ కట్ చేశాడు. పంత్ మాట లెక్కచేయకుండా ధోని కాల్ కట్ చేయడంతో రోహిత్, సూర్య కుమార్‌లు నవ్వుకున్నారు.
MS Dhoni came on Rishabh Pant Instagram live for a moment. #MSDhoni #RishabhPantpic.twitter.com/PaZmyKu3cO
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) July 26, 2022
కాగా.. ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నాడు. వెకేషన్‌లో భాగంగా ధోని ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు.