Video : 'మా ఇద్దరి పాత్ర చాలా పెద్దది'.. నవ్వులు పూయించిన సిరాజ్
ఐసీసీ టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత జట్టు ఆటగాళ్ల నుండి అనేక ఫన్నీ, భావోద్వేగ క్షణాలు వెలువడ్డాయి.
By - Medi Samrat |
ఐసీసీ టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత జట్టు ఆటగాళ్ల నుండి అనేక ఫన్నీ, భావోద్వేగ క్షణాలు వెలువడ్డాయి. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పాల్గొన్న అలాంటి ఒక క్షణం సోషల్ మీడియాలో విస్తృత దృష్టిని ఆకర్షించింది.
విజయం తర్వాత సిరాజ్ కుల్దీప్ యాదవ్ పాత్ర గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు, సిరాజ్ చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు, దానికి అందరూ నవ్వడం ప్రారంభించారు. భారత్ టైటిల్ గెలుచుకున్న తర్వాత జరిగిన సంభాషణలో ప్రపంచ కప్ విజయానికి తన, కుల్దీప్ యాదవ్ కృషి ఏమిటని ఒక విలేకరి అడగగా.. సిరాజ్ నవ్వుతూ, "మా ఇద్దరి పాత్ర చాలా పెద్దది.. బయట కూర్చుని, ఆటగాళ్లకు నీళ్లు ఇవ్వడం, వారి బ్యాట్లను మోయడం చాలా పెద్ద పని అని అన్నాడు. సిరాజ్ వ్యాఖ్యలు జోక్‌గా తీసుకున్నారు అభిమానులు.. అది సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంది.
T20 ప్రపంచ కప్ సమయంలో కొంత మంది టీం ఇండియా ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు రాలేదు. పరిమిత అవకాశాలు పొందిన వారిలో సిరాజ్, కుల్దీప్ ఉన్నారు. అయితే మైదానంలో ఎక్కువ సమయం గడపకపోయినా, ఇద్దరు ఆటగాళ్లు టోర్నమెంట్ అంతటా జట్టుతోనే ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
2026 ICC T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో వారు రికార్డు స్థాయిలో మూడవసారి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి, కివీస్ జట్టుకు 256 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ వారు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
Mohammed Siraj and Kuldeep Yadav share their emotions after being crowned champions. 🏆❤️#Champions #INDvNZ pic.twitter.com/Omqg91W4nr
— Star Sports (@StarSportsIndia) March 8, 2026