రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై మొహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. 6 వికెట్లు తీసి సిరాజ్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. 9 ఓవర్ల పాటూ బౌలింగ్ వేసిన సిరాజ్ 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. సిరాజ్‌కు బుమ్రా కూడా తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లోపడింది. టీమిండియా పేసర్ల దెబ్బకు సఫారీ జట్టు టాప్ 4 బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరిన్నే, కేశవ్ మహారాజ్ సిరాజ్ బౌలింగ్ కు బలయ్యారు. కష్టపడి 50 పరుగుల మార్కును దాటింది దక్షిణాఫ్రికా. 8 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా.