తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్నా.. జట్టు కోసమే ఆలోచించాడు..!

Mohammed Siraj Decides To Stay Back With Team India. తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ జట్టు

By Medi Samrat  Published on  22 Nov 2020 6:11 AM GMT
తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్నా.. జట్టు కోసమే ఆలోచించాడు..!

తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి వార్త‌ల్లో నిలిచాడు. క్రికెటర్‌గా రాణించాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఈ విష‌య‌మై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. సిరాజ్‌తో బీసీసీఐ మాట్లాడింది. ఈ కష్ట‌కాలంలో కుటుంబసభ్యుల వద్ద సమయం గడిపేందుకు సిరాజ్‌ను స్వదేశానికి పిలిపించాలనుకున్నామని.. కానీ సిరాజ్‌ జట్టుతో పాటు ఉండేందుకే మొగ్గు చూపాడని తెలిపారు. ఈ గడ్డు పరిస్థితిలో అతడికి మేం మద్దతుగా నిలుస్తామ‌ని షా తెలిపాడు.అలాగే.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా సిరాజ్‌ను కొనియాడాడు. 'సిరాజ్‌ది అద్భుతమైన వ్యక్తిత్వం. జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితిని అధిగమిస్తాడని ఆశిస్తున్నా. ఈ టూర్‌లో అతడు విజయం సాధించాలి' అని దాదా ట్వీట్‌ చేశాడు. ఇదిలావుంటే.. సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు.


Next Story
Share it