ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?

భారత క్రికెట‌ర్, హైదరాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.

By Medi Samrat  Published on  9 Aug 2024 2:19 PM GMT
ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?

భారత క్రికెట‌ర్, హైదరాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. టీ-20 వరల్డ్ కప్ గెలుపు తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో సిరాజ్‌కు నగరంలో ఇంట స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గ‌జాల స్థ‌లం కేటాయిస్తూ.. రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

సిరాజ్‌తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్‌-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Next Story